మా అన్నవరం
మా ఇంట్లో పొద్దున రెండు గంటలు, ఇంక సాయంత్రం రెండు గంటల సమయం మాత్రమే పనిచేసిన అన్నవరం మా ఇంట్లో మనిషి లాంటిదె.
నాకు మా బామ్మగారు మామూలుగా కంటే అన్నవరం తో పాటు కలిసి నడవడమే ఎక్కువ గుర్తుంది. వృద్దాప్య దశ లో మా బామ్మగారికి సహాయం చెయడం కోసం అన్నవరం మా ఇంటికి వచ్చింది. దొరికింది తినటం తప్ప బ్రతకడానికి ఏ పని తనకు రాకపైతుఁడె. అప్పటికే తనకి ముగ్గురు పిల్లలు, ఒక భర్త. వున్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పడం లో తనకుతానే సాటి. అలా తాను అల్లిన కొన్ని కధలు మీ కోసం.
వచ్చిన కొత్తలో తోమిన గిన్నెలను సద్దడం కూడా చేతకాదు అన్నవరానికి. మా అమ్మ నిత్యం వాడే మాట “హా! పడేశావా? సర్లే మిగిలినవి నాకు మిగిలినవి నీకు.” ఇలా కొంత కాలానికి మాకు తాను, తనకి మేము అలవాటు పడిపోయాం.
ఒక రోజు మా అమ్మ పుట్టింటికి వెళ్ళింది. ఆ పూట మా నాన్నగారికి కూర వండడం రాక వండిన అన్నం కూడా అన్నవరానికి ఇచ్చి హోటల్ కు వెళ్లిపోయారు. అది చూసిన అన్నవరం మా నాన్నగారికి మా అమ్మ మీద బెంగ వచ్చి అన్నం తినడం మానేశారు అని వీధి మొత్తం చాటింపు వేయించింది. అమ్మ తిరిగి వచ్చాక ఇరుగు పొరుగు వాళ్ళందరూ చెప్పింది విని నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు.
అన్నవరం వాళ్ళ అయినా సముద్రం మీదకి వేటకి వెళ్తాడు. ఒకవేళ వెళ్లకుండా రోజు మొత్తం తాగుతూ కుర్చున్నాడా, ఆ రోజుకి అన్నం పెట్టదు పైగా చెప్పు దెబ్బలతో సత్కారం. ప్రపంచం మొత్తంలో అన్నవరానికి భయపడే ఏకైక వ్యక్తి తన భర్త మాత్రమే. వాళ్ళాయన్ని తిట్టినా కొట్టిన వెంటనే గొప్ప పని చేసినట్టు మా ఇంటికి వచ్చి చెప్తుంది. అది కూడా నిజమో అబద్దమో తెలియని మేము అన్నవరం అమాయకత్వం చూసి నవ్వుకుంటాం.
అన్నవరానికి మొత్తం జీతం పది రూపాయల నోట్లగానే ఇవ్వాలి. ఒక వేళ 100, 500, 2000 నోట్లగా ఇచ్చామా కొట్టువాడికి వంద నొట ఇచ్చి తిరిగి చిల్లర తీసుకోకుండా వచ్చేసిన సందర్భాలు చాల వున్నాయి.
అలాగే ఒక రోజు నా తల్లితండ్రులు ఇద్దరు నా సోదరుడిని ఇంటికి తీసుకుని వద్దాం అని పాఠశాల కు వెళ్లగా దాన్ని చూసి నా సోదరుడిని ఆసుపత్రి లో చేర్చారని వీధి మొత్తం ప్రచారం చేసింది. వారు వెంటనే మా తల్లితండ్రుల్ని సంప్రదిస్తే కానీ తెలియలేదు అన్నవరం కదా అల్లినట్లు.
అన్నవరానికి దొంగ బుద్ధి ఉందా లేదా అని కూడా మనం పసిగట్టలేము. ఒకవేళ తనకి నచ్చి ఏదైనా వస్తువు దొంగతనం చేసినా తన దగ్గరకి వెళ్లి “నా వస్తువు ఒకటి పోయింది నీకేమైనా దొరికిందా?” అని అడిగితే “ఆగో ఆడ దొరికినది!” అని చెప్పి ఇచ్చేస్తుంది.
ఇన్ని సంఘటనలు జరిగినా మా అన్నవరానికి మాకు వున్నా బంధం విడదీయరానిది. మా అమ్మకి ఒక రోజు అన్నవరాన్ని చూడకపోయినా ఆ రోజు రోజులానే గడవదు. మా ఇంట్లో రోజు వుండే సంభాషణ “అన్నవరం నిన్న ఎందుకు రాలేదు?” అంటే “రాలేదు!” అనే సమాధానం మాత్రమే. అదే పదాన్ని సమాధానంగా విని నవ్వుకుంటూ మేమందరం పది ఏండ్లు గడిపేసాం.
ఎడిటర్: అబ్రార్ అహ్మద్